నయనతార చికెన్ బాగా చేస్తుందట

- Advertisement -
Nayanthara


నయనతారని త్వరలోనే పెళ్లాడనున్నాడు దర్శకుడు విగ్నేష్ శివన్. ఇప్పటికే వీరికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఎప్పుడు అని ఇటీవల ఒక అభిమాని ఇన్ స్టాగ్రామ్ చాట్ లో అడిగాడు. తప్పించుకోకుండా సమాధానం ఇచ్చాడు విగ్నేష్. “కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ఉంటుంది,” అని స్పష్టంగా చెప్పాడు.

ALSO READ: Nayanthara to get married after the COVID crisis ends?

అలాగే, నయనతారలో నచ్చే గుణాలు కూడా ఏకరువు పెట్టాడు.

మేకప్ తీసేసి… షూటింగ్ నుంచి ఇంటికి వస్తే నయనతార ఒక సాదాసీదా అమ్మాయిలా మారిపోతుందట. వంట చేస్తుందట. ఇంటి పనులు చేసుకుంటుందట. ఆమెకి చికెన్ వండి పెట్టడం ఇష్టమంట. “ఆమె చేసే వంటల్లో నా ఫేవరిట్ …చికెన్ ఫ్రై,” అని చెప్పాడు విగ్నేష్ శివన్.

Nayanthara and Vignesh Shivan

ప్రస్తుతం విగ్నేష్, నయనతార కలిసే ఉంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా సాగుతోంది వీరి సహజీవనం. నయనతార ఇప్పటికే కోలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.

 

More

Related Stories