అక్కడా నయనతార పాలసీ మారలేదు!

- Advertisement -
Nayanthara


నయనతార తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్. సినిమాకి 6 కోట్ల వరకు తీసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి హిందీ చిత్రం… జవాన్.

మొదటి హిందీ మూవీలోని షారుక్ సరసన నటించింది. పైగా ఆమె షారుక్ కి వీరాభిమాని. ఇక హిందీలో కూడా ఆమె తన పద్దతి, రూల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి కారణం షారుక్ ఖాన్ తాజా నిర్ణయమే.

సాధారణంగా బాలీవుడ్ లో ప్రమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. పెద్ద హీరోలైనా సిటీస్ అన్ని తిరుగుతారు. అనేక ఇంటర్వూలు ఇస్తారు. ఈవెంట్స్ లో పాల్గొంటారు. కానీ, నయనతార ఇలాంటి వాటికి దూరం. ఆమె తెలుగులో నటించినా, తమిళ్ లో నటించినా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. అది ఆమె పాలసీ. తెలుగులో ఒక్క ‘శ్రీరామరాజ్యం’ సినిమాకి తప్ప ఏ సినిమాకి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు.

బాలీవుడ్ లో ఆమె పద్దతి మార్చుకోవాల్సి వస్తుంది అని అనుకున్నారు. కానీ, తాజాగా షారుక్ ఖాన్ తన పంథాని మార్చుకున్నారు. ఆయన కూడా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారు. విడుదలకు ముందు ఎలాంటి ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లేవు. “పఠాన్” సినిమాకి అలాగే చేసి విజయం సాధించారు. ఇప్పుడు “జవాన్”కి కూడా అదే పద్దతిలో వెళ్తున్నారట.

Jawan

సో, నయనతార తన “నో ప్రొమోషన్” పాలసీని షారుక్ కోసం కూడా మార్చుకోవాల్సిన అవసరం కలగట్లేదు.

 

More

Related Stories