
నయనతార సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్. పారితోషికం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. సినిమాకి నాలుగు కోట్ల రేంజ్ లో ఉంది ఆమె పారితోషికం. బాగా సంపాదించడమే కాదు వాటిని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తోంది. నిర్మాతగా సినిమా నిర్మాణం చేపట్టింది నయనతార. అలాగే, ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతోంది.
‘చాయ్ వాలా’ అనే కాఫీ/టీ షాప్ ల కంపెనీలో 5 కోట్ల పెట్టుబడి పెట్టిందట. ఆ కంపెనీ చెన్నైలో అనేక ప్రాంతాల్లో టీ రెస్టారెంట్లు నడుపుతోంది. ఇందులో చాలా గ్రోత్ ఉందని నయనతార భావిస్తోంది.
అలాగే, తన అభిరుచికి అనుగుణంగా ఒక హై క్లాస్ రెస్టారెంట్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందట. దాని కోసం ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది.
నయనతార ఇప్పటికే 35 దాటింది. హీరోయిన్ గా ఆమె కెరీర్ ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదు. అందుకే. తెలివిగా పెట్టుబడులు చేస్తోంది. ఆమె ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ తో కలిసి జీవిస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.