అక్క పాత్రలో నయనతార

- Advertisement -
Nayanthara

నయనతార భర్త విగ్నేష్ శివన్ ఇప్పటికే ఆమెతో పలు సినిమాలు తీశాడు. “నేనూ రౌడీనే” సినిమాలో ఆమె విగ్నేష్ డైరెక్షన్లో నటించింది. ఆ సమయంలోనే వీరు దగ్గరయ్యారు. ఆ తర్వాత సమంత, నయనతారతో విగ్నేష్ ఇటీవల ఒక మూవీ తీశాడు. ఇప్పుడు మరో చిత్రం.

ప్రదీప్ రంగనాథన్ హీరోగా విగ్నేష్ ఒక సినిమా తీస్తున్నాడు. “లవ్ టుడే” సినిమాతో ప్రదీప్ రంగనాథన్ పాపులర్ అయ్యాడు. ఐతే, ప్రదీప్ సరసన నయనతార నటించడం లేదు. అతనికి అక్కగా ఆమె నటించనుంది.

ఇది కూడా రొమాంటిక్ కామెడీ. నయనతార ఈ సినిమాలో కామెడీ చేస్తుందట. అక్క, తమ్ముడు మధ్య సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. భర్త కోసం నయనతార ఇలా ఒక యువ హీరోకి అక్కగా నటిస్తోంది. కేవలం భర్త కోసమే. వేరే నిర్మాతలు, దర్శకులు అడిగితే మాత్రం అప్పుడే అక్క పాత్రలు చేయను అంటోంది.

ఇటీవలే నయనతార హిందీలో కూడా భారీ హిట్ అందుకొంది. షారుక్ ఖాన్ వంటి పెద్ద హీరోకి ప్రియురాలిగా నటించి అక్క పాత్రలు చెయ్యదు కదా. ఇంకా హీరోయిన్ గానే కంటిన్యూ అవుతోంది.

 

More

Related Stories