సొంత బ్యానర్లోనే సినిమాలు

- Advertisement -
Nayanthara


హీరోయిన్ నయనతార ఇటీవల పెద్ద హీరోల సరసన సినిమాలు పొందడం లేదు. బాలీవుడ్ లో షారుక్ సరసన “జవాన్” వంటి బిగ్ మూవీలో నటించింది. కానీ, తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల ఆమె పెద్ద హీరోల సరసన నటించిన సినిమాలు లేవు.

ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటడ్ చిత్రాలు, చిన్న చిత్రాలు ఎక్కువగా చేస్తోంది. అలాగే తన నిర్మాణ సంస్థని బోలోపేతం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. తన భర్త విగ్నేష్ తో కలిసి ఆమె రౌడీ పిక్షర్స్ అనే సంస్థని స్థాపించింది. దానిపై వరుసగా సినిమాలు తీస్తోంది. ఇప్పుడు మరో నాలుగు సినిమాలు ఈ బ్యానర్ పై ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

నయనతారకి పెళ్లి అయింది. ఇటీవలే తల్లి అయింది. అటు సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు సినిమాలు కూడా చేస్తోంది. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చెయ్యడం తగ్గించింది.

ఇప్పుడు ఆమె తన భర్తని దర్శకుడిగా, నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

More

Related Stories