హీరోయిన్ నయనతార మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ కూడా చెయ్యదు. కానీ, ఇటీవల ఆమె స్కిన్ కేర్ ఉత్పత్తులను ప్రారంభించింది. దాంతో తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకునేందుకు ఎల్లే మ్యాగజైన్ కి పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది.
తన కెరీర్, తన భర్త, తన లైఫ్ గురించి చాలా మాట్లాడింది. అలాగే, స్టార్డం గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని తేల్చింది. ఇప్పుడు స్టార్ వాల్యూ కన్నా కథనం ముఖ్యం అయింది అని అంటోంది.
ఒకప్పుడు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని చూసేవాళ్ళు ప్రేక్షకులు. దాంతో హీరోయిన్లు అందంగా ఉండేందుకు కష్టపడేవాళ్లు. “కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. ఫేస్ వాల్యూని పట్టించుకోవడం లేదు. పాత్ర బాగుంటే ఎవరు నటించినా ఆదరిస్తున్నారు. ఫేస్ ఎవరిది అనేది చూడట్లేదు,” అని చెప్పింది నయన.
ఐతే, తన వరకు తాను మాత్రం చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను అని చెప్తోంది. స్కిన్ అందంగా, మృదువుగా ఉండాలి అనేది ఆమె భావన. అందుకే మగువల కోసం తాను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లాంచ్ చేశాను అంటోంది.