ముహూర్తం ఫిక్స్ కాగానే చెప్తా: నయనతార

- Advertisement -
Nayanthara


ఇన్ని రోజులు నయనతార పెళ్లి గురించి మీడియాలో ప్రచారం జరగడం తప్ప ఆమె నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మొదటిసారి, ఆమె తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. స్టార్ విజయ్ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం డీటైల్డ్ గా తన పెళ్లి గురించి మాట్లాడింది.

నయనతార మాటల్లోనే….

“ఇది నా నిశ్చితార్థం రింగ్ (వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ). విగ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు మాత్రమే నిశ్చితార్థానికి హాజరయ్యారు. పెద్ద హడావిడిగా సంబరాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే… సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యే మా నిశ్చితార్థ వేడుక జరిగింది. పెళ్ళికి డేట్ ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఉంటుంది. ముహుర్తాలు కుదిరిన తర్వాత నేనే చెపుతా. అభిమానులకు సమాచారం ఇస్తాను. రహస్యంగా పెళ్లి చేసుకోను.”

విగ్నేష్ శివన్, నయనతార నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు, చాలా కాలంగా కలిసి ఉంటున్నారు. ఐతే, పెళ్లి మాత్రం ఇంకా కాలేదు. అలాగే, విగ్నేష్ ని తన బాయ్ ఫ్రెండ్ అని రాయొద్దని మీడియాని కోరుతోంది నయనతార.

“ఆయన నా కాబోయే భర్త. బాయ్ ఫ్రెండ్ స్టేజి అయిపోయింది. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయింది. మీడియా ఫ్రెండ్స్ అలా రాస్తేనే బాగుంటుంది,” అని చెప్తోంది. కోరుతోంది నయనతార. తన వ్యక్తిగత జీవితంలో ఏది దాచుకోలేదని చెప్తోంది నయనతార. మీడియా కూడా తనకు అలాంటి గౌరవం ఇవ్వాలనేది ఆమె మాట.

 

More

Related Stories