
నయనతార కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఈరోజు తన పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్నాడు. చెన్నైలోని తమ ఇంట్లోనే నయనతార అతనికి బర్త్ డే పార్టీ ఇచ్చింది. అతను ఊహంచని బహుమతి కూడా ఇచ్చిందట. దాంతో, ఉబ్బితబ్బిబ్బయిన విగ్నేష్ నయనతారకి “థాంక్యూ బంగారూ” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ పార్టీ ఫోటోలను కూడా షేర్ చేశాడు.
‘నేనూ రౌడీనే’ అనే సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు విగ్నేష్ శివన్. ఆ సినిమాలో హీరోయిన్ కూడా నయనతారే. ఆ సెట్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అందుకే, వీరిద్దరూ కలిసి ప్రారంభించిన నిర్మాణ సంస్థకి కూడా “రౌడీ పిక్షర్స్” అనే పేరు పెట్టారు.
ప్రస్తుతం నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన తారాగణంగా విగ్నేష్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ టీం అందరిని పిలిచి బర్త్ డే పార్టీ ఇచ్చింది.
ఈ జంట త్వరలోనే ఒకటి కానుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్ళికి ముహూర్తం కూడా ఖరారు కానుంది.