నయనతార కొత్త వెంచర్!

Nayanthara


నయనతార సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్. సినిమాకి కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఏ తెలుగు, తమిళ హీరోయిన్ కి ఇవ్వనంత డబ్బు ఆమెకి ఇస్తున్నారు. ఆమె సినిమాకి 5 నుంచి 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. నిర్మాత, ప్రాజెక్ట్ ని బట్టి పారితోషికం అటు ఇటుగా ఉంటుంది.

హీరోయిన్ గా కోట్లు సంపాదిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా బోలెడంత గడుస్తునే ఉంది. ఇప్పుడు వ్యాపారంలో కూడా దూసుకుపోతోంది. ఆమెకి నిర్మాణ సంస్థ ఉంది. అలాగే హోటల్ వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్, శరీర సరంక్షణకి సంబంధించిన ఉత్పత్తులను లాంచ్ చేసింది.

నయనతార, ఆమె భర్త విగ్నేష్ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. దానిలో భాగంగానే ఆమె ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

నయనతార ఒకప్పుడు సాదాసీదాగా ఉండేది. రంగు, హంగు అంతా సాధారణమే. ఐతే, హీరోయిన్ గా ఒక మంచి పొజిషన్ కి వచ్చాక ఆమె కలర్, స్కిన్ టోన్ అంతా మారిపోయింది. సామాన్య యువతులు కూడా తనలా మారిపోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అని ప్రచారం చేస్తోంది.

Advertisement
 

More

Related Stories