
నయనతార, ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మకాం అక్కడే. కానీ, ఇద్దరికి వేర్వేరు రూములు ఇచ్చారట.
చెన్నైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తుంది ఈ జంట. అలాంటి కపుల్ కి రామోజీ ఫిలిం సిటీలో వేర్వేరు గదులు కేటాయించడానికి ఒక రీజన్ ఉంది.
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న “అన్నత్తే” సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో నటిస్తున్న వారెవ్వరూ కూడా సినిమా యూనిట్ కి సంబంధం లేని వారితో కలవకూడదు. దీన్ని ‘బయో బబుల్’ అంటారు. అంటే బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా సినిమా టీం మొత్తం ఒకే చోట ఉండి షూటింగ్ పూర్తి చెయ్యడం అన్నమాట. కరోనా నేపథ్యంలో రజినీకాంత్ కోసం ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన వయసుని దృష్టిలో పెట్టుకొని ఇలా బయో బబుల్ క్రియేట్ చేశారు.
దాంతో నయనతార తన బాయ్ ఫ్రెండ్ ని కలవలేని పరిస్థితి.
ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాడు. ఆయన విజయ్ సేతుపతి, సమంత జంటగా ఒక తమిళ్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. ఐతే, రజినీకాంత్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు, ఆ సినిమా టీం, ఈ సినిమా టీం కలవకూడదట. అందుకే… ఈ లవర్స్ కి వేర్వేరు రూముల్లో వసతి ఏర్పాటు చేశారనేది టాక్.