భర్తకే ఆఫర్లు…భార్యకి లేవు!

Nazriya


హీరోయిన్ నజ్రియాకి ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండేది. తన క్యూట్ లుక్స్ తో తమిళ, మలయాళ కుర్రకారుని ఆకట్టుకొంది. ఏడెనిమిదేళ్ళ క్రితం ఆమె సినిమాలు చూసి అభిమానం ఏర్పరచుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆమెని పట్టుబట్టి తెలుగులో నటించేలా ఒప్పించాడు. అలా, ఆమె ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కానీ, ఈ ఎనిమిది ఏళ్ళలో చాలా మారింది. నజ్రియా ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ ఫహద్ కి భార్య. ఫహద్ ఫాజిల్ తెలుగులో ఇటీవలే ‘పుష్ప’ సినిమాలో నటించాడు. అందులో పోలీసాఫీసర్ గా అదరగొట్టాడు. అలాగే, కమల్ నటించిన ‘విక్రమ్’ సినిమాలో కూడా సూపర్ రోల్ చేశాడు. ఈ రెండు సినిమాలతో ఫహద్ కి తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. సక్సెస్ దక్కింది.

కానీ, నజ్రియాలో 8 ఏళ్ల క్రితం ఉన్న ఆ అమాయకత్వం లేదు. ఆమెలో ‘పరిణతి’ ఎక్కువగా ఉంది. సో… తెలుగు కుర్రాళ్ళు ఆమెని చూసి ఇప్పుడు పెద్ద ఇదయిపోలేదు. అందుకే, ‘అంటే సుందరానికి’లో ఆమె నటిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సినిమా కూడా ప్లాప్ అయింది. దాంతో, ఆమెని తీసుకోవాలని తెలుగు నిర్మాతలు భావించడం లేదు.

నిజానికి, వివేక్ ఆత్రేయ గొప్పగా చెప్పుకున్నట్లు ఆమె మాత్రమే చెయ్యాల్సిన పాత్ర ‘అంటే సుందరానికి’లో లేదు. పోనీ, 10 ఏళ్ల క్రితం ఉన్నంత అందంగా ఉందంటే లేదు. అందుకే, నజ్రియాకి తెలుగులో క్రేజ్ రాలేదు. ఆమె భర్త ఫహద్ కి మాత్రం తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.

 

More

Related Stories