
నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేనిల కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. రీసెంట్ గా బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలాగే, ఈ సినిమాకి ‘వీరసింహరెడ్డి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది.
ఐతే, తాజా సమాచారం ప్రకారం ‘రెడ్డి’ అనే టైటిల్ వద్దని బాలయ్య సూచించారట. దాంతో, మరో పవర్ ఫుల్ టైటిల్ కోసం దర్శకుడు ఆలోచిస్తున్నాడు అని టాక్.
గతంలో బాలయ్య ‘సమరసింహారెడ్డి’ వంటి రెడ్డి టైటిల్స్, ‘నరసింహనాయుడు’ వంటి నాయిడు టైటిల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఈ సారి కులం తోకలు లేని టైటిల్స్ కావాలని అన్నట్లు టాక్.
మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు.