క్రిస్మస్ ముహూర్తం సెట్ అయ్యేనా?

NBK107


నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తీస్తున్న సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇటీవలే టర్కీ వెళ్లి అక్కడ ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించుకొని వచ్చింది టీం. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతారట. అంటే, రెండు నెలల్లో ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంటుంది.

ఐతే, సినిమా విడుదల తేదీపై ఇంకా నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. కానీ, నిర్మాతలకు డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ఉంది. గతేడాది ‘అఖండ’ డిసెంబర్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకే, డిసెంబర్ ఐతే బాగుంటుందని అనుకుంటున్నారు.

పైగా, సంక్రాంతికి కాంపీటీషన్ ఎక్కువగా ఉంది.

ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ జనవరి 12న విడుదల కానుంది. విజయ్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న ‘వారసుడు’ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది. కుదిరితే చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ కూడా రావొచ్చు. ఇంత పోటీలో సినిమాని విడుదల చెయ్యడం కన్నా క్రిస్మస్ కి సోలోగా రావడం బెటర్ అనేది నిర్మాతల భావన.

ఐతే, బాలయ్య నిర్ణయమే ఫైనల్. ముహుర్తాలు, విడుదల తేదీల విషయంలో ఆయన చాలా పక్కాగా ఉంటారు. మరి ఆయన ఏమంటారో చూడాలి.

 

More

Related Stories