బాలయ్య సినిమాపై కోవిడ్ పంజా


నందమూరి బాలకృష్ణ ఇటీవల మరోసారి కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పటికే ఆయనకి రెండు సార్లు కోవిడ్ వచ్చింది. ఇక, తాజాగా ఆయన సినిమా టీంలో దాదాపు అందరికీ కోవిడ్ సోకింది. దాంతో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ షూటింగ్ ఆగింది.

ఈ సినిమా ముందు అనుకున్న షెడ్యూలు మారిపోయింది. దాంతో, దసరా బరిలో నిలుపుదామనుకున్న నిర్మాతల ఆలోచన వర్కౌట్ అయ్యేలా లేదు. దసరాలోపు షూటింగ్ పూర్తి కావడం కష్టం. ‘అఖండ’లాగే ఈ సినిమాని కూడా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. భారీ ఫైట్లు, హంగామా ఉంటుంది. అందుకే, దసరాకే విడుదల చెయ్యాలంటే సాధ్యం కాదని అనుకుంటున్నారట.

దసరా ఫెస్టివల్ మిస్ ఐతే, ‘అఖండ’లా డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే పేరు పరిశీలనలో ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

More

Related Stories