కర్నూలులో కత్తి పట్టిన బాలయ్య

NBK107


నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో వ్యహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో సాగుతుంది.

సోమవారం కర్నూలులో నగరానికి గుర్తుగా ఉన్న కొండారెడ్డి బురుజు వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలయ్య కత్తి పట్టుకొని నిల్చున్న కొత్త ఫోటోని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫోటో బాగా వైరల్ అయింది.

గతంలో బాలయ్య అనేక చిత్రాల షూటింగ్స్ కర్నూలులో జరిగాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కత్తి పట్టుకొని సీమ సింహంలా గర్జిస్తున్నారు బాలయ్య.

శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనుంది. ఆమె ఇంతకుముందు గోపీచంద్ మలినేని హిట్ సినిమా ‘క్రాక్’లో కూడా నటించారు.

 

More

Related Stories