రియా: మూడోసారి విచారణ

Rhea

డ్రగ్స్ లింక్స్ గురించి రియా చక్రవర్తిని మూడోసారి విచారిస్తోంది నార్కోటిక్స్ బ్యూరో. ఆమె ఈ రోజు కూడా ముంబైలో నార్కోటిక్స్ అధికారుల ముందుకి వెళ్ళింది ఈ సారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మరింతమందిని ఆమె ముందు కూర్చుండబెట్టి ప్రశ్నలు అడుగుతారట.

ఆమెని మొదటి రోజే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ రియా చక్రవర్తి …తాను డ్రగ్స్ కొన్నది కేవలం సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ కోసమే అని తేల్చి చెప్పడంతో బ్యూరో ఏమి చెయ్యలేకపోయింది. పైగా రియాని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రచారం ఫుల్లుగా సాగుతుండడంతో… అధికారులు ఇప్పుడు ఆచితూచి విచారణ చేస్తున్నారు.

మరోవైపు, సుశాంత్ సింగ్ రాజపుత్ కుటుంబ సభ్యులు ఆడిన అబద్దాలు అన్ని బయటికి వచ్చాయి. సుశాంత్ స్నేహితుడుగా చెప్పుకుంటున్న సందీప్ సింగ్ ఎవరో తమకి తెలియదు అని సుశాంత్ కుటుంబ సభ్యులు ఇంతకుముందు పోలీసులకు చెప్పారు. దాంతో సందీప్ సింగ్ తాజాగా సుశాంత్ సోదరీమణులతో జరిపిన వాట్సాప్ చాట్ బయటపెట్టాడు. సుశాంత్ అంత్యక్రియలు మొదలుకొని డెత్ సర్టిఫికెట్….. ఇంకా ఇతర పనుల్లో మొత్తగా అతని సాయం తీసుకొంది సుశాంత్ కుటుంబం. ఆ చాట్ బయటపెట్టిన తర్వాత సుశాంత్ సిస్టర్స్ మౌనం వహిస్తున్నారు.

అలాగే సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడన్న విషయం తెలీదు, అలాగే అతను డిప్రెషన్ కోసం మందులు వాడుతున్నట్లు తెలీదని చెప్పింది ఆయన కుటుంబం.

తాజాగా అది కూడా అబద్దమని తేలింది. అలాగే జూన్ 8 తర్వాత… సుశాంత్ సిస్టర్ ప్రియాంక… తన సంతకం ఫోర్జరీ చేసి మందులు కొన్నది అని రియా లేటెస్ట్ గా కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో రియా అరెస్ట్ విషయంలో మరికొంత సమయం తీసుకుంటుందా బ్యూరో లేక ఈ రోజు అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి.

Related Stories