“నీ దారే నీ కథ” అంటూ ఒక కొత్త సినిమా వస్తోంది. జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేశారు.
నిర్మాత తేజేష్
“ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి.”
నిర్మాత శైలజ జొన్నలగడ్డ
“మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది.”
నిర్మాత, దర్శకుడు వంశీ జొన్నలగడ్డ
” నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్ లో ఉన్నప్పుడు రాసుకున్న స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా చేయడమైనది.