భార్యగా ఉంటే నెలకు 25 లక్షలు!

శేఖర్ కమ్ముల తీసిన ‘గోదావరి’ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? తెలుగులోనే కాదు హిందీలో కూడా అనేక చిత్రాలు చేసిన నీతూ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. 38 ఏళ్ల ఈ భామ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెటింది. అలా ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది.

ఆమె చెప్పిన సంచలనాల్లో కొన్ని…

“ఒక వ్యాపారవేత్త నన్ను ఉంచుకుంటానని ఆఫర్ ఇచ్చాడు. నెలకు పాతిక లక్షలు ఇస్తా నా భార్యగా ఉండు అని అన్నాడు. ఛీ కొట్టి వచ్చా.”

“ఒక సినిమాలో ఆఫర్ కి అని పిలిచారు. ఈ పాత్రకి నువ్వే బాగుంటావు అని ఆడిషన్ కి పిలిచాడు క్యాస్టింగ్ డైరెక్టర్. గంటలోనే మాట మార్చి నిన్ను తీసుకోవట్లేదు అన్నాడు. రిజెక్ట్ చెయ్యడానికి నన్ను ఆఫీస్ పిలిచావా అని అడిగా?”

Neetu Chandra

“ఎన్నో సినిమాల్లో నటించా. కానీ ఎదుగుదల కనిపించలేదు. ప్రస్తుతం పనీ కూడా ఇవ్వట్లేదు. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి పనికి రాను.”

బాలీవుడ్ లో ‘గరం మసాలా’, ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘ఓయే లక్కీ లక్కీ ఓయే’ వంటి చిత్రాలలో నటించింది నీతూ. తెలుగులో ‘విష్ణు’, ‘గోదావరి’, ‘సత్యమేవ జయతే’ సినిమాల్లో కనిపించింది. తమిళంలో ‘యుద్ధం సెయ్’, ’13బి’ వంటి చిత్రాల్లో నటించింది.

 

More

Related Stories