వెనక్కి తగ్గిన జూనియర్ బెల్లంకొండ

Nenu Student Sir

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వెండితెరపై హల్చల్ చేసి చాలా కాలమే అయింది. రెండేళ్లుగా పత్తా లేడు. ఆయన తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా తన సినిమాల విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉన్నాడు.

గణేష్ ‘స్వాతిముత్యం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. గతేడాది విడుదలైంది. రెండో సినిమాగా “నేను స్టూడెంట్ సర్” అనే చిత్రం చేశాడు. మార్చి 10న విడుదల కావాలి. ఐతే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో పోస్ట్ పోన్ చేస్తున్నామని తెలిపింది టీం. వేసవి సెలవుల్లో కలుసుకుందామని అంటున్నారు.

స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ.. “నేను స్టూడెంట్ సర్”. ఇందులో భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా పరిచయమవుతోంది.

విద్యార్థులు, యూత్ థియేటర్ కి రాకపోతే ఈ సినిమా విడుదల చేసి దండగ. ఇలాంటి కథలకు వాళ్లే మెయిన్ టార్గెట్. అందుకే సినిమాని వాయిదా వేశారు.

 

More

Related Stories