‘రానా నాయుడు’ తొలగించలేదు కదా!

Venkatesh and Rana


వెంకటేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. గత మూడు వారాలుగా ఇది ఇండియాలో టాప్ 10లో కొనసాగుతోంది. అంటే, జనం బాగానే చూస్తున్నారు. ఐతే, ఇందులో వెంకటేష్ మాట్లాడే కొన్ని బూతులు, శృంగార సన్నివేశాలు మోతాదు మించి ఉన్నాయి అనేది విమర్శ.

వెంకటేష్ అభిమానులు, తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ ని చూసి దడుసుకున్నారు. ఆ బూతుల వినలేక చాలామంది చూడడం ఆపేశారు. ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేష్ ఇలా ఎలా నటించాడు అనేది అందరి నుంచి వినిపిస్తున్న కామెంట్.

తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన తెలుగు వర్షన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించింది అని రెండు రోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. కానీ అది పూర్తిగా అబద్దం.

తెలుగు వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. దానిని తొలగించలేదు.

Advertisement
 

More

Related Stories