బాహుబలిని డస్ట్ బిన్ లో పడేశారు!

Baahubali


‘బాహుబలి’ది ఒక చరిత్ర. రాజమౌళి తీసిన ఈ భారీ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రని తిరగరాసింది. దాంతో, అంతర్జాతీయ స్ట్రీమింగ్ కంపెనీ ‘బాహుబలి’ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. ‘బాహుబలి’లోని శివగామి పాత్ర చుట్టూ అల్లిన కథతో నెట్ ఫ్లిక్స్ రాజమౌళి సూచనలతో వెబ్ సిరీస్ మొదలుపెట్టింది. కానీ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత క్వాలిటీ బాగాలేదు అని నెట్ ఫ్లిక్స్ దాన్ని పక్కన పెట్టింది. అలా 100 కోట్లు ఆవిరయ్యాయి. .

మరో 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి మరో టీంకి షూటింగ్ బాధ్యతలు అప్పచెప్పింది. ఆ టీం తీసింది కూడా నచ్చలేదు. దాంతో… మొత్తంగా ‘బాహుబలి’ని డస్ట్ బిన్ లో పారేసింది.

ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ 200 కోట్లపైనే ఖర్చు పెట్టింది. ఆ మొత్తం మొత్తం గంగలో కలిసినట్లే. తీసింది నచ్చలేదు అని పక్కన పెట్టడమే విచిత్రం.

నెట్ ఫ్లిక్స్ అమెరికా, యూరోప్ తో పాటు కొరియా, జపాన్ లో బాగా క్లిక్ అయింది. కొరియా వాళ్ళు తీసిన కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతున్నాయి. దాంతో, నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది 22 కొరియన్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఐతే, ఇప్పటివరకు తాము ఇండియాలో సక్సెస్ కాలేకపోతున్నామని నెట్ ఫ్లిక్స్ చెప్తోంది.

Advertisement
 

More

Related Stories