ప్రపంచానికి తెలియని రష్మిక

రష్మిక ఓ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె కాల్షీట్ కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కట్టే పరిస్థితి ఉంది. ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె ఉంది. బాలీవుడ్ కు కూడా వెళ్లింది. ముంబయిలో ఇల్లు కూడా తీసుకుంది. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే రష్మికలో మరో కోణం ఉంది. ప్రపంచానికి తెలియని రష్మిక మరొకరు ఉన్నారంటోంది ఈ బ్యూటీ. వాటికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టింది.

అన్ని షూటింగ్స్ ఆపేసింది రష్మిక. హడావుడిగా ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. ఆల్రెడీ ఓ ఫ్లయిట్ మిస్సయింది. మరో ఫ్లయిట్ లేట్ అవుతోంది. అయినప్పటికీ ఓపిగ్గా ఎయిర్ పోర్టులో వెయిట్ చేసింది. ఇదంతా ఆమె చేసింది కేవలం తన స్నేహితురాలి పెళ్లి కోసం.

అవును.. రష్మికకు ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది. 8 మంది గ్యాంగ్ అంటే రష్మికకు చాలా ఇష్టం. బయట జనాలకు తెలియని మరో ప్రపంచం వాళ్లే అని చెబుతోంది రష్మిక. ఇప్పుడు వాళ్లలో ఒకరికి పెళ్లి అవుతోంది. ఆ పెళ్లి కోసం రష్మిక, అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్లింది. పెళ్లికూతురును స్వయంగా తనే ముస్తాబు చేసింది. తను కూడా ట్రెడిషనల్ దుస్తుల్లోకి మారిపోయింది.

17 ఏళ్ల వయసు నుంచి ఇదే గ్యాంగ్ తో ఉంటోందట రష్మిక. ప్రపంచానికి తన గురించి తెలియని ఎన్నో విషయాలు వీళ్లకు తెలుసని చెబుతోంది. వీళ్లతో గడిపినప్పుడు తను ప్రపంచాన్ని మరిచిపోతానంటోంది. ఈ విషయాలన్నింటినీ రష్మిక స్వయంగా తన ఇనస్టాగ్రామ్ పేజీలో రాసుకొచ్చింది. ఫ్రెండ్ పెళ్లిలో తను చేసిన హంగామాకు సంబంధించి కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేసింది. 

 

More

Related Stories