ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు

NTR

తెలుగు సినిమా రంగ వైభవానికి ప్రతీక … నందమూరి తారక రామారావు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఎన్టీఆర్ చరిత్ర ప్రత్యేకం. తెలుగుసినిమా రంగాన్ని, తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ చిరకాలపు వాంఛ తీరలేదు కానీ ఎన్టీఆర్ జిల్లా మాత్రం సాధ్యమైంది.

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. దాంతో, ఆయన పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అనే పేరుని ఖరారు చేసింది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాని రెండుగా విడదీసి, విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు ఇక ఆంధ్రపదేశ్ లో శాశ్వతం కానుంది. జిల్లాకి పేరు పెడితే అధికారికంగా అదే పేరుతో ఎప్పటికీ వ్యవహరిస్తారు. అలా ఎన్టీఆర్ పేరు ఆంధ్రప్రదేశ్ లో విడదీయరాని భాగం కానుంది.

భారతరత్న కూడా దక్కితే ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేరుతుంది.

Advertisement
 

More

Related Stories