మళ్ళీ నటించనున్న ‘మామ్’ పూర్ణ

Poorna

హీరోయిన్ పూర్ణ మాతృత్వపు మధురిమ ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఒక బాబుకు జన్మనిచ్చింది పూర్ణ.

ఆమె భర్త, పూర్ణ రెగ్యులర్ గా తమ బాబు ఫోటోలను ఇన్ స్టాగ్రాంలో అప్డేట్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫీడ్ చూస్తే పూర్ణ గృహిణిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది అనిపిస్తోంది. ఆమె మళ్ళీ నటించే ఆలోచనే లేదనిపిస్తుంది. కానీ, ఆమె మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ భామ తాజాగా గోపీచంద్ కొత్త చిత్రం సైన్ చేసిందట. గోపీచంద్ హీరోగా ఏ హర్ష అనే దర్శకుడు తీస్తున్న కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒక భామగా మాళవిక శర్మ నటించనుంది. మరో హీరోయిన్ ఇంకా సెలెక్ట్ కాలేదు. ఇక ఒక కీలక పాత్రలో పూర్ణని తీసుకున్నట్లు సమాచారం.

పూర్ణ ప్రస్తుతం దుబాయిలో భర్తతో ఉంటున్నారు. ఐతే, తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ. ఆమె దుబాయ్ నుంచి వచ్చి షూటింగ్ లో పాల్గొని… పని పూర్తి కాగానే వెళ్లారు. కేరీర్ కి కొంతకాలం బ్రేక్ ఇచ్చేందుకు ఆమె ఇష్టపడడం లేదు.

Advertisement
 

More

Related Stories