రియా ఆ విషయాన్ని దాచిందా?

Rhea Chakraborty

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వీటిలో ముఖ్యంగా 2 అంశాల్ని చెబుతున్నారు. వాటిలో ఒకటి డైరీ కాగా, రెండోది సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.

సుశాంత్ ఇంటి నుంచి అతడి ప్రస్తుత డైరీతో పాటు, పాత డైరీల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో ఉన్న అంశాలు కేసు విచారణకు బాగా పనికొస్తున్నాయని చెబుతున్నారు. ఈ డైరీ పరిశీలించిన తర్వాతే రియా చక్రవర్తి ఓ విషయాన్ని కావాలనే దాచిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అదే రెండో అంశం.

రియా చక్రవర్తి తమ్ముడు శోవిక్ చక్రవర్తి కూడా సుశాంత్ కు మంచి స్నేహితుడట. కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు.. సుశాంత్, శోవిక్ వ్యాపార భాగస్వాములు కూడా. ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని వీళ్లిద్దరూ కలిసి స్థాపించారు. అందులో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు.

అయితే విచారణలో రియా చక్రవర్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. కేవలం సుశాంత్ డైరీ చదివిన తర్వాత మాత్రమే పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేయబోతున్నారు.

Related Stories