ఎన్టీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్

NTR

తన అభిమానులకు కొత్త ఏడాది కానుక అందించాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు చూడని కొత్త ఫొటోతో క్యాలెండర్ రిలీజ్ చేసి, ఫ్యాన్ గ్రూప్స్ కు అందించాడు.

ఈ క్యాలెండర్ లో ఎన్టీఆర్ రాయల్ గా, స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. బహుశా ఈ క్యాలెండర్ కోసమే ఈ ఫోటోషూట్ చేసినట్లు ఉంది. అభిమానులను ఈ లుక్, ఈ స్టైల్ అలరించింది.

2023 మొత్తం వెండితెరకు దూరమయ్యాడు ఎన్టీఆర్. “ఆర్ఆర్ఆర్” లాంటి పెద్ద సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కొరటాల దర్శకత్వంలో “దేవర” సినిమా చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇలా తన స్టిల్ తో క్యాలెండర్ రిలీజ్ చేశాడు.

ప్రస్తుతం ఈ హీరో, తన కుటుంబంతో కలిసి జపాన్ లో విహరిస్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. “ఆర్ఆర్ఆర్” సక్సెస్ తో ఎన్టీఆర్ కు గ్లోబల్ లెవల్లో పేరు వచ్చింది.

ఇక “దేవర మొదటి భాగం” టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ గ్లిమ్ప్స్ పనులు పూర్తి అయ్యాయి.

Advertisement
 

More

Related Stories