- Advertisement -

హన్సిక పెళ్లి చేసుకొంది. 30 ఏళ్ళలోపే పెళ్లి కూతురిని కావాలని అనుకొంది. అనుకున్నట్లే జరిగింది. ఆదివారం జైపూర్ లో ఆమె పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది.
పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఐతే, హన్సిక ఇప్పటివరకు తన పెళ్లి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చెయ్యలేదు. చేతినిండా మెహందీ, గాజులు పెట్టుకుని పెళ్లి జరిగింది అర్థం వచ్చే ఒక క్లోజప్ ఫోటో మాత్రం ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది.
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచన లేదని ఇంతకుముందే స్పష్టం చేసింది హన్సిక. ఆమె భర్త సోహెల్ కూడా ఆమె తన కెరీర్ ని కంటిన్యూ చేసుకోమనే చెప్పాడట.
ఐతే, ప్రస్తుతం ఆమెకి పెద్దగా క్రేజ్ కూడా లేదు. తమిళంలో మాత్రం అవకాశాలు అడపాదడపా వస్తున్నాయి.
ALSO READ: Hansika Motwani ties knots with Sohael