ఆ సినిమాకు ఎట్టకేలకు మోక్షం

NGK

సూర్య సినిమాలు మార్కెట్లో హాట్ కేక్. అతడి సినిమాలు హిట్టయినా, ఫ్లాప్ అయినా శాటిలైట్ సెగ్మెంట్ లో మాత్రం ఆగవు. మరీ ముఖ్యంగా సూర్య, సాయిపల్లవి, రకుల్ కాంబినేషన్ అంటే చెప్పేదేముంది. వద్దన్నా శాటిలైట్ డీల్ పూర్తయిపోతుందని కలలుకన్నాడు నిర్మత కేకే రాథామోహన్. కానీ “ఎన్జీకే” సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిర్మాత ఆశలు అడియాశలన్నాయి.

గతేడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా నిన్నమొన్నటివరకు శాటిలైట్ కు నోచుకోలేదు. ఇప్పుడు లాక్ డౌన్ సీజన్ కావడంతో కొత్త సినిమాల కోసం వెదికే క్రమంలో “ఎన్జీకే” డీల్ క్లోజ్ అయింది. స్టామ్ మా ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకొని, నిన్ననే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టీవీలో ప్రసారం చేసింది.

అలా సరిగ్గా రిలీజైన ఏడాదికి సూర్య సినిమా శాటిలైట్ కు నోచుకుంది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా టీవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఓటీటీలో ఈ సినిమా ఆల్రెడీ ఉంది కాబట్టి, టీఆర్పీ ఏ రేంజ్ లో వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది

Related Stories