షాక్ తిన్న నిధి అగర్వాల్!

Nidhhi

హీరోయిన్లకు గుడి కట్టడం అనేది కొత్తేమి కాదు. ముఖ్యంగా తమిళనాడులో ఆ కల్చర్ చాలా ఎక్కువ. వాళ్ళకి నచ్చితే నెత్తిన పెట్టుకోవడమే కాదు పూజలు కూడా చేస్తారు. ఖుష్బూ, నమిత, హన్సిక వంటి వారికి గుళ్ళు కట్టి పూజలు జరిపారు తమిళ సినిప్రియులు. ఐతే, బాగా పాపులరిటీ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి అలాంటి క్రేజు దక్కింది. హీరోయిన్ నిధికి మాత్రం రెండు సినిమాలతోనే అలాంటి వింత ఎదురైంది.

తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులర్ అయిన నిధి అగర్వాల్ రీసెంట్ గా తమిళ్ లో రెండు సినిమాలు చేసింది. ఒకటి ‘భూమి’, రెండోది ‘ఈశ్వరన్’. ఈ రెండూ గత నెలలో విడుదల అయ్యాయి. అవి పెద్దగా సంచలనాలు ఏమి క్రియేట్ చెయ్యలేదు. కానీ, ‘ఈశ్వరన్’లో ఆమె అందచందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ మూవీ హీరో శింబు ఫాన్స్ కి ఆమె బాగా నచ్చింది. దాంతో, ఆమెకి చెన్నైలో గుడి కట్టి, పాలాభిషేకాలు జరిపారు.

సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసి షాక్ తిన్నాను అంటోంది నిధి అగర్వాల్. ఇంత క్రేజ్ వస్తుందని అనుకోలేదని మురిసిపోతోంది.

More

Related Stories