
తమిళ హీరో శింబుకి ప్రేమాయణాలు కొత్త కాదు. నయనతార, హన్సికతో లవ్ అఫైర్ ల గురించి అందరికీ తెలుసు. హన్సికతో పెళ్లి వరకు వెళ్ళింది మ్యాటర్. ఐతే తాగుడు, ఇతర వ్యసనాలతో కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని చెడగొట్టుకున్నాడు. ఆ విషయం తర్వాత తనే గ్రహించి వాటి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. దాని ఫలితమే… రీసెంట్ గా ‘మనాడు’ అనే సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు.
హీరోగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శింబు ఇప్పుడు మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అని సోషల్ మీడియాలో, కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇందులో నిజమెంతో తెలీదు. ఇంతకీ ఆయనకి లింక్ పెడుతూ ప్రచారంలోకి వచ్చిన హీరోయిన్ ఎవరో కాదు నిధి అగర్వాల్.
తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఈ సంక్రాంతికి ‘హీరో’ అనే సినిమాతో మనముందుకు రానుంది. తమిళంలో కూడా ఆమె చేతిలో పలు చిత్రాలున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె శింబుతో ప్రేమలో పడింది అని గుసగుస మొదలైంది.
నిధి అగర్వాల్ శింబుతో ‘ఈశ్వరన్’ అనే సినిమాలో నటించింది. గతేడాది విడుదలైంది ఆ మూవీ. అప్పటి నుంచే వీరి మధ్య ఎదో ఉంది అని టాక్ మొదలైంది. ఐతే, ఇప్పుడు ఇంకా సీరియస్ గా మారిపోయారు అని ప్రచారం.