- Advertisement -

నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆ సినిమాల విడుదల ఆలస్యం అవుతోంది. దాంతో, ఆమెకి పబ్లిసిటీ ఇంకా రావడం లేదు. ఐతే, ఈ భామ ‘అన్ స్టాపబుల్’ షోలో మెరిసింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న”అన్ స్టాపబుల్” చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వెళ్లారు. ఈ షోలో నిధి అగర్వాల్ కూడా కనిపించింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో ముచ్చటించింది నిధి ‘హరి హర వీర మల్లు’ విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆమె ఈ షోలో పంచుకుంది.
మరోవైపు, ప్రభాస్ సరసన కూడా నటిస్తోంది నిధి.