బర్త్ డే…బాధపడుతున్న బ్యూటీ

- Advertisement -
Nidhhi Agerwal

ఎవరైనా పుట్టినరోజు నాడు ఫుల్ ఖుషీగా ఉంటారు. కేక్ కట్ చేసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక హీరోయిన్ల బర్త్ డేల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దీనికి భిన్నంగా నిధి అగర్వాల్ బాధపడుతోంది. ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ చిన్నది.. ఈ బర్త్ డే కి బాధగా ఉందని ప్రకటించింది.

ఇంతకీ నిధి అగర్వాల్ బాధకు కారణం ఏంటో తెలుసా? కొన్నేళ్లుగా తన ప్రతి పుట్టినరోజును సెట్స్ లోనే సెలబ్రేట్ చేసుకునేదట నిధి. అలా పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఆనందమని కూడా చెబుతోంది. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వల్ల తను మూవీ సెట్స్ మిస్సయ్యానని, అలా బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా మిస్సయ్యానని చెబుతోంది.

ప్రస్తుతం బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న నిధి అగర్వాల్.. ఇంట్లోనే అమ్మా-నాన్న మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించింది. ఈ సందర్భంగా అశోక్ గల్లా హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఆమె లుక్ ను రిలీజ్ చేశారు.

 

More

Related Stories