సింగిల్ టార్గెట్ తో వచ్చిన నిధి

- Advertisement -

హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి ఆన్ లైన్లోకి వచ్చింది. ఈసారి మరికొన్ని సంగతుల్ని షేర్ చేసుకుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కాకపోయి ఉంటే ప్లాన్-బి ఏంటనే విషయంపై ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయింది.

– ఇష్టమైన పాట?
తెలుగు నుంచి ఉండిపోరాదే అనే పాట చాలా ఇష్టం

– ఎలాంటి ప్రేమను కోరుకుంటారు?
ఎలాంటి కండిషన్లు లేని ప్రేమను కోరుకుంటాను.

– జీవితంలో ఎక్కువగా ఏది చేయడానికి ఇష్టపడతారు?
ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాను. ఖాళీగా ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. పెయింటింగ్స్ గీశాను, ఆన్ లైన్ క్లాసులు ఎటెండ్ అయ్యాను.

– నటి కాకపోయి ఉంటే…?
అలాంటి ఆలోచనే లేదు. ఇప్పుడు కాకపోతే మరో మూడేళ్ల తర్వాతైనా నటి అవుదామనే అనుకున్నాను. అదే టార్గెట్ తో వర్క్ చేశాను. మరో ప్రొఫెషన్ గురించి ఆలోచించలేదు.

 

More

Related Stories