- Advertisement -

ఆ పాటల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. కిస్ సీన్లలో కూడా ఇబ్బంది పడకుండా నటించే ఈ భామకి ఇంతకీ ఏ పాటలు నచ్చవో తెలుసా? వాన పాటలు అంటే అయిష్టమని చెప్తోంది.
వాన పాటలు అంటే చాలా చికాకు అంటోంది. వానల్లో తడవడం, మళ్ళీ బట్టలు ఆరబెట్టుకోవడం, మళ్ళీ తడవడం… చాలా చిరాగ్గా ఉంటుందట. వాన పాట షూటింగ్ అంటే నరకమే కనిపిస్తుంది అని చెప్తోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. అందుకే, అలాంటి పాటలు ప్లాన్ చేయొద్దని చెప్తుందట దర్శకులకు.
నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. అలాగే, గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ నటిస్తున్న ‘హీరో’ సినిమాలో ఈ అమ్మడే హీరోయిన్.