నేర్చుకునే పనిలో పడిన నిధి

Nidhii Agerwal

హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పుడు నేర్చుకునే పనిలో పడింది. ఓవైపు కొత్త సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తూనే, మరోవైపు లెర్నింగ్ ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయిన నిధి అగర్వాల్.. ఇప్పుడు తమిళ భాష నేర్చుకునే పనిలో కూడా బిజీ అయింది.

అవును.. నిధి అగర్వాల్ తమిళం నేర్చుకుంటోంది. దీనివల్ల తనకు తమిళ సినిమాలు చేయడానికి మరింత కాన్ఫిడెన్స్ వస్తుందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ లో తను చెప్పే డైలాగ్స్ ను ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నానని, మరికొన్ని రోజుల్లో ధారాళంగా తమిళ్ లో మాట్లాడతానని నమ్మకంగా చెబుతోంది నిధి.

బాలీవుడ్ లో ”మున్నా మైఖేల్” సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ”ఇస్మార్ట్ శంకర్” తో గుర్తింపు తెచ్చుకుంది. అంతకంటే ముందు ”మిస్టర్ మజ్ను”, ”సవ్యసాచి” లాంటి సినిమాలు చేసింది. ఇప్పుడు తమిళ్ లో ”భూమి” అనే సినిమాతో లక్ చెక్ చేసుకుంటోంది. ఈ సినిమా తర్వాత మరిన్ని కోలీవుడ్ సినిమాలు చేసే ఉద్దేశంతో ఇప్పట్నుంచే తమిళ్ నేర్చుకుంటోంది ఈ చిన్నది.

Related Stories