మాల్దీవుల్లో నిహారిక హనీమూన్

నిహారిక కూడా మాల్దీవులకు వెళ్ళింది. మొన్న కాజల్, గౌతమ్ హనీమూన్ ట్రిప్ ఫోటోలు, వీడియోలు చూశాం. వాళ్లిద్దరూ మాల్దీవులకు వెళ్లారు. ఇప్పుడు నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా మాల్దీవుల్లో హనీమూన్ చేసుకుంటున్నారు.

నిహారిక, చైతన్య పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరిగింది.

మరోవైపు, నిహారిక భర్త కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయ్యాడు. “విజేత” అనే సినిమాలో నటించాడు. త్వరలో “సూపర్ మచ్చి” అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. సో, నాగబాబు అల్లుడు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడా అన్నది చూడాలి.

పెళ్లి తర్వాత నిహారిక మాత్రం సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొంది.

More

Related Stories