నిహారిక గోవాలో ఏం చేస్తోంది?

Niharika

మరికొన్ని రోజుల్లో పెళ్లి. దానికి సంబంధించి బిజీగా ఉండాల్సిన మెగా డాటర్ నిహారిక ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఎంచక్కా గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇది కూడా పెళ్లిలో ఓ భాగమే.

అవును.. గోవాలో తన క్లోజ్ సర్కిల్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది ఈ బ్యూటీ. పెళ్లికి ముందు ఇలా బ్యాచిలర్ పార్టీలు చేసుకోవడం కామన్. మొన్నటికిమొన్న కాజల్ కూడా ఇలానే పెద్ద పార్టీ ఇచ్చింది. ఇప్పుడు నిహారిక కూడా అదే పనిచేసింది.

కాకపోతే ఈ పార్టీలో మెగా మొహాలు కనిపించలేదు. పూర్తిగా నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కనిపించారు. పార్టీలో నిహారిక స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. గోవాలో తన హంగామాను ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Related Stories