‘డివోర్స్’ మాటెత్తని నిహారిక

Niharika


నిహారిక, ఆమె భర్త విడిపోతున్నారు అని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఆమె భర్త చైతన్య ఇప్పటికే నిహారిక ఫొటోలన్నీ తన ఇన్ స్టాగ్రామ్ టైంలైన్లో తొలగించాడు. ఐతే, మీడియాలో ఇంత రచ్చ అవుతున్నా నిహారిక ఆ మాట గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.

సాధారణంగా తన గురించి ఏదైనా వార్త వస్తే… ఆ వార్తని షేర్ చెయ్యడమో లేదంటే తప్పు ఐతే అది కరెక్ట్ కాదంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఎప్పుడూ పెడుతూ ఉండేది నిహారిక. అది ఆమె పద్దతి. కానీ, ‘డివోర్స్’ వార్తల గురించి మాత్రం ఒక్క పోస్ట్ లేదు.

15 వారాలుగా ఇన్ స్టాగ్రామ్ లో సైలెన్స్ పాటించింది. ఒక్క ఫోటో పెట్టలేదు. ఇప్పుడు సడెన్ గా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. పాతకాలం హీరోయిన్ల తరహాలో రెట్రో లుక్ అంటూ ఒక ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను సోమవారం (మార్చి 27) నాడు పోస్ట్ చేసింది.

అంతేకాదు ‘స్టోరీస్’లో కూడా తన వీడియోస్ పెడుతోంది. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే విషెష్ కూడా పెట్టింది.

మరోవైపు, ఆమె ఫోటోలు బాగున్నాయి అని ఆమె ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు. మరికొందరు… “అంతా సెట్ అయిందా?” అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి, ఆమె తన డివోర్స్ గురించి ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Advertisement
 

More

Related Stories