బిజీబిజీగా నిహారిక

Niharika

ఓవైపు లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ నిహారిక మాత్రం ఫుల్ బిజీ అయిపోయింది. అదేంటి.. ఆమె చేతిలో పెద్దగా సినిమాల్లేవు కదా. మరి బిజీ ఎలా అయిందనుకున్నారా..? ఆమె తన పెళ్లికి సంబంధించి బిజీ అయింది. ఈ మేరకు 3 టార్గెట్లు పెట్టుకుంది నిహా. ఒక్కొక్కటిగా చూద్దాం.

Also Check: నిహారిక కొత్త ఫోటోలు చూశారా

డిసెంబర్ లో పెళ్లి. కాబట్టి అప్పటికి ఫిజికల్ గా ఎలా తయారవ్వాలో ఓ టార్గెట్ పెట్టుకుంది నిహారిక. దాని కోసం రోజూ ఉదయం-సాయంత్రం జిమ్ కు వెళ్లి కష్టపడుతోంది. ఇక రెండో టార్గెట్ ఏంటంటే.. బ్యూటీ. పెళ్లినాటికి తన అందాన్ని మరింత పెంచుకునే దిశగా దృష్టిపెట్టింది. దీనికోసం ఆమె ఇంట్లో రకరకాల చిట్కాలు ఫాలో అవుతోంది.

Niharika walks out of a Tamil film

ఇక ముచ్చటగా మూడో టార్గెట్ షాపింగ్. పెళ్లికి సంబంధించి ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసింది నిహా. ఏ అకేషన్ కు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ యాక్ససిరీస్ కొనాలి అనే అంశంపై ఇప్పటికే లిస్ట్ రాసి పెట్టుకున్నఈ బ్యూటీ.. అందుకు తగ్గట్టు ఒక్కొక్కటిగా కొనుక్కుంటోంది. ఇలా తన రెగ్యులర్ లైఫ్ లో ఫుల్ బిజీ అయిపోయింది నిహారిక.

Related Stories