
నిహారిక కూడా విడాకుల దిశగా వెళ్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆమె ఒక పబ్ లో ఉదయం నాలుగు గంటల వరకు ఇతర స్నేహితులతో గడపడం, ఆ పబ్ పై పోలీసులు దాడి చెయ్యడంతో ఒక పెద్ద రగడ జరిగింది. అలాగే, ఆమె, ఆమె భర్త రెంట్ కి తీసుకున్న అపార్ట్మెంట్ వద్ద గొడవ జరగడం, అది పోలీసు కేసు వరకు వెళ్ళింది.
దాంతో, ఆమె కొన్నాళ్ళూ ఇన్ స్టాగ్రామ్ నుంచి దూరమైంది. ఆమె భర్త కూడా తన ఇన్ స్టాగ్రామ్లో నిహారిక ఫోటోలు షేర్ చెయ్యలేదు. ఇవన్నీ కలిసి వీరి కాపురం గురించి పుకార్లకు కారణమయ్యాయి.
చాలా గ్యాప్ తర్వాత ఆమె తన భర్తకి విష్ చేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే విషెష్ తెలిపింది. “నా కూలెస్ట్ కుకుంబర్. నా అల్లరికి ఒక ప్రశాంతతని ఇచ్చే వ్యక్తివి అయినందుకు థాంక్స్. ఐ లవ్యూ బేబీ,” అంటూ పోస్ట్ చేసింది.
సో, వీరి కాపురం గురించి అనవసర పుకార్లకు తెరపడినట్లే. హ్యాపీగా ప్రేమగా ఉంది ఈ జంట.