మౌనం అంగీకారమా?

Niharika

నిహారిక, ఆమె భర్త విడిపోయారు. ఇది మీడియాలో తెగ ప్రచారం అయింది. ఐతే ఇప్పటివరకు ఆమె కానీ, ఆమె భర్త కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. విడిపోయాం అని కానీ, కలిసి ఉన్నట్లుగానీ చెప్పలేదు.

ఐతే, ఇప్పుడు నిహారిక మీడియా ముందుకు తరుచుగా వస్తోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్నాయి. వీటి ప్రమోషన్స్ కోసం ప్రెస్ మీట్స్ కి హాజరవుతుంది. తాజాగా ఒక జర్నలిస్ట్ ఆమె విడాకుల గురించి ప్రస్తావన తెచ్చాడు. అంతే…. ఆమె తన మైక్ ని పక్కనున్న స్టార్స్ కి అందించింది. ఆ మాట గురించి మాట్లాడకుండా మైక్ ని ఇచ్చేసింది.

ఆమె విడాకుల గురించి కూడా మాట్లాడదల్చుకోవడం లేదు అన్నమాట. ఐతే, ఆమె మౌనం అంగీకారంగానే తీసుకోవచ్చు. ఎందుకంటే, వాళ్ళు విడిపోకపోయి ఉంటే ఆ ప్రశ్నకు వెంటనే రివర్స్ లో జర్నలిస్ట్ ని గట్టిగా దబాయించేది. కానీ మౌనంగా ఉండడం వల్లే ఆమె తన డివోర్స్ గురించి క్లారిటీ ఇచ్చినట్లయింది.

నిహారిక ప్రస్తుతం వెబ్ డ్రామాల్లో ఎక్కువగా నటిస్తోంది. నిర్మాతగా కూడా వెబ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Advertisement
 

More

Related Stories