మా ఆయనకి అది నచ్చదు: నిహారిక


నాగబాబు కూతురు నిహారిక పెళ్ళికి ముందు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కాకపొతే, అవి ఏవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మానేసింది. వెబ్ డ్రామాలు, సిరీస్ లలో మాత్రం కనిపించనుంది. అలాగే, వెబ్ సిరీస్ నిర్మాణం కూడా చేపట్టింది.

“మా ఆయనకి నేను సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. అందుకే, సినిమాల్లో నటించట్లేదు. అలాగనీ, పెళ్లి తర్వాత హీరోయిన్లకు క్రేజ్ ఉండదు అనడం కూడా తప్పు,” అని నిహారిక చెప్తోంది.

నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ ఇప్పుడు సొంతంగా ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు. విడిగా కాపురం పెట్టారు. సినిమాల్లో నటించకపోయినా వెబ్ సిరీస్ లు, వెబ్ డ్రామాలు మాత్రం వదిలేది అని చెప్తోంది. ఎదో ఒక పని చెయ్యకపోతే ఉండలేను అని అంటోంది.

నిహారిక గతేడాది జైపూర్ లో పెళ్లి చేసుకొంది. చైతన్య, ఆమెది అరెంజ్డ్ మ్యారీజ్.

 

More

Related Stories