
నిహారిక పెళ్లి తేదీ బయటకొచ్చింది. ఆమె మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. డిసెంబర్ 9న నిహారిక-చైతన్యల పెళ్లి జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు నిహారిక-చైతన్య పెళ్లితో ఒకటవ్వనున్నారు.
వీళ్ల పెళ్లికి వేదిక కూడా ఖరారైంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక పెళ్లి జరిపించాలని మెగా కాంపౌండ్ ఫిక్స్ అయింది. పెళ్లి పనులన్నీ నిహారిక అన్న, మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆహ్వానాలు అందించే బాధ్యత కూడా అతడిదే.
దాదాపు నెల రోజుల ముందు నుంచే పెళ్లికి రెడీ అవుతోంది నిహారిక. పెర్ ఫెక్ట్ ఫిజిక్ కోసం రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూనే, మరోవైపు పెళ్లి షాపింగ్ పూర్తిచేసే పనిలో పడింది.
ఆగస్ట్ లో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం పూర్తయింది. హైదరాబాద్ లో ఎంగేజ్ మెంట్ జరగడంతో, పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ నిహారిక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్టు నాగబాబు ఇదివరకే ప్రకటించారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.