
నిహారిక కొణిదెల హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలతో బాగా పేరు తెచ్చుకొంది. ఇక ఇప్పుడు నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభిస్తోంది.
పింక్ ఎలిఫెంట్ పిక్షర్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ స్థాపించింది. ఆ బ్యానర్ పై మొదటి మూవీ స్టార్ట్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 10) ఆ మూవీ లాంఛనంగా లాంచ్ అవుతుంది.
భర్త నుంచి విడిపోయాక ఆమె మళ్ళీ హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది అని అనుకున్నారు. ఐతే ఆమె నటిగా కన్నా నిర్మాతగా రాణించాలని అనుకుంటోంది. సినిమాలు, వెబ్ డ్రామాలు నిర్మిస్తుంది. కొత్త టాలెంట్ కి ప్రోత్సహం ఇస్తుందట.
ఆమె తండ్రి నాగబాబు ఇంతకుముందు అంజనా ప్రొడక్షన్స్ పై సినిమాలు తీసేవారు. కానీ నిహారిక మాత్రం చిన్న సినిమాలు మాత్రమే నిర్మిస్తుంది.
ALSO CHECK: For Niharika getting dressed become a routine