మళ్ళీ వచ్చిన నిహారిక భర్త


హీరోయిన్ నిహారిక ఒక టెకీని పెళ్లాడింది. చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే కాపురం పెట్టింది. ఐతే, నిహారిక, ఆమె భర్త రెంట్ కి తీసుకున్న అపార్ట్మెంట్ లో ఒక గొడవ జరగడం, ఆమె భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లడం, అది హెడ్ లైన్స్ గా మారడం జరిగింది. ఆ తర్వాత ఒక పబ్ పై పోలీసులు దాడి చేసినప్పుడు నిహారిక అందులో ఉండడం కూడా పెద్ద వార్త అయింది.

ఈ నెగెటివ్ న్యూస్ కారణంగా నిహారిక కొన్నాళ్ళూ సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ట్రోలింగ్ భరించలేక ఆ నిర్ణయం తీసుకొంది. ఇటీవలే ఆమె మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ ని యాక్టివేట్ చేసింది. చాలా పోస్టులు పెడుతోంది. మరోవైపు, ఆమె భర్త తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేశాడు.

నిహారిక మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లోకి రాగానే ఆయన వెళ్లిపోవడంతో కొన్ని అనుమానాలు కలిగాయి. కానీ, వాటిని పటాపంచలు చేస్తూ వెంకట చైతన్య జొన్నలగడ్డ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు ఇన్ స్టాలో.

మొన్న తన భార్యకి బర్త్ డే విషెష్ తెలుపుతూ ఇన్ స్టాలో దర్శనమిచ్చాడు.

 

More

Related Stories