కరోనా దెబ్బకి నో హనీమూన్

కరోనా దెబ్బకి నో హనీమూన్

సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య షార్ట్ గ్యాప్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ చైతూ మాత్రం ఇలా పెళ్లి చేసుకొని అలా సెట్స్ పైకి వచ్చేశాడు. ఇప్పటివరకు ఈ జంట ప్రత్యేకంగా హనీమూన్ లాంటిదేం జరుపుకోలేదు. మధ్యమధ్యలో ఫారిన్ టూర్స్ కు మాత్రం వెళ్లొచ్చారు. సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోవాలని నిర్ణయించుకున్నాడు హీరో నిఖిల్. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరో.. గ్యాప్ తీసుకోవడం లేదు. వెంటనే సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. పైపెచ్చు సినిమాల విషయంలో స్పీడ్ కూడా పెంచాడు.

దానికి కారణం ఏంటంటే కరోనా. కరోనా వాళ్ళ విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. ఫ్లైట్స్ లేవు. పైగా… అంతట కరోనా ప్రభావమే. ఎక్కడికి వెళ్లినా క్వారంటెన్ లో ఉంచుతారు. అందుకే “ప్రేమ యాత్రలకు బాలి, బార్సిలోనా ఏలనో … కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ,” అని పాడుకుంటూ హనీమూన్ ప్లాన్ లేకుండా చేసుకున్నాడు. 

కోట్లు సంపాదించిన సెలెబ్రెటీలకు హనీమూన్ లేకపోతే ఎదో వెలితిగా అనిపిస్తుంది కానీ… మరి కరోనా పంజా ఆలా ఉంది మరి. 

 

More

Related Stories