తప్పు చెయ్యదు…చేసుకోక తప్పదు!

Nikhil Siddhartha

నిఖిల్ సిద్ధార్థ్, నాని, రామ్ వంటి హీరోలు తెలుగులో మంచి పంచ్ డైలాగ్ లు రాస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు పోస్టులలో ఇలాంటివి కనిపిస్తాయి. ఎదో పోస్ట్ వేశాం అని కాకుండా తమదైన రైటప్ పెడుతుంటారు.

తాజాగా నిఖిల్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ ఫోటోని పెడుతూ ఇలా రాశారు – “వ్యాక్సినేషన్ తప్పు చేయదు. చేసుకోక తప్పదు.” అందరూ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పేందుకు ఈ ప్రాస శైలిని జోడించారు. మొన్న నాని కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇలాగే ఫన్నీగా రాసాడని చెప్పక్కర్లేదు కదా.

ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ’18 పేజెస్’ అనే సినిమా డైరెక్ట్ గా ఓటిటి వేదికపైనే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక మరో చిత్రం ‘కార్తీకేయ 2’ షూటింగ్ ఇంకా మిగిలి ఉంది.

 

More

Related Stories