విడుదల సమస్యలు వేధిస్తున్నాయి!

నిఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రెండేళ్లుగా సినిమా విడుదల చెయ్యలేకపోయాడు. ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేద్దామనుకుంటే నిర్మాత దిల్ రాజు తాను నిర్మిస్తున్న ‘థాంక్యూ’ చిత్రాన్ని ఆ డేట్ కి రిలీజ్ చేస్తున్నారు. దాంతో, తన సినిమాని అనివార్యంగా మార్చాల్సి వచ్చింది నిఖిల్ కి.

మరి ఈ ‘కార్తికేయ 2’ని ఆగస్టు మొదటివారంలో విడుదల చెయ్యాలా? రెండో వారంలోనా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. ఈ సినిమాకే రిలీజ్ డేట్ సమస్య ఉంటే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ’18-పేజెస్’ అనే చిత్రానికి కూడా అదే సమస్య ఉంటుంది.

GA 2 బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు తీసిన ఈ చిత్రాన్ని . సెప్టెంబర్ 10న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, ‘కార్తికేయ 2′ సినిమా రిలీజ్ విషయంలోనే ఒక సరైన డేట్ దొరకట్లేదు. దాంతో, ’18-పేజెస్’ మరో నెల వాయిదా వెయ్యాలి. అక్టోబర్ లోనో, ఆ తర్వాత విడుదల చెయ్యాలి.

ఈ సినిమాలు కాకుండా “స్పై” అనే మరో సినిమా కూడా లైన్లో ఉంది. మరి అదెప్పుడో?

 

More

Related Stories