దాన్నే నమ్మాను: నిఖిల్

Nikhil Siddharth


హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తీకేయ 2’ ఈ మధ్య కాలంలో పెద్ద విజయం సాధించిన తెలుగు చిత్రం. తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి విజయం సాధించింది. ఇప్పటికే హిందీ మార్కెట్ లో 20 కోట్లు కొల్లగొట్టింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ ని పొందింది.

“కంటెంట్ ని బలంగా నమ్మాను. గొరిల్లా మార్కెటింగ్ చేశాం. మౌత్ టాక్ ఈ సినిమా విజయానికి కీలకం,” అని నిఖిల్ అంటున్నారు. ప్రమోషన్ విషయంలో గొరిల్లా పద్దతిని నమ్మడమే తమ విజయ రహస్యం అని వివరించారు నిఖిల్.

ఈ ఆగస్టులో ‘బింబిసార’, ‘సీతారామం’, చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తీకేయ 2’ పెద్ద విజయాలు నమోదు చేశాయి. ఐతే, అందులో నిఖిల్ చిత్రమే చివరికి ఈ మూడింటిలో బిగ్ హిట్ గా నిలుస్తోంది. హిందీలో సక్సెస్ కావడం, అమెరికాలో దాదాపు మిలియన్నర డాలర్ల మార్క్ చేరుకోవడం ఈ సినిమాకి ప్లస్.

నిఖిల్ కెరియర్ కి ఈ సినిమా పెద్ద ఊపు తెచ్చింది. రిలీజ్ కి ముందు నా సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా కిల్ చేస్తున్నారు అని నిఖిల్ ఏడుపు ముఖం పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆయన సినిమాకే అన్ని థియేటర్లు దక్కాయి.

 

More

Related Stories