రీషూట్ చేయమంటున్న నిఖిల్

Nikhil Siddharth

రీషూట్ చేయమంటున్న నిఖిల్

‘కార్తీకేయ 2’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు నిఖిల్. అనుకోకుండా ఆ సినిమా హిందీలో కూడా ఆడింది. దాంతో, తన సినిమాలకు బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పడింది అని భావిస్తున్నాడు నిఖిల్. ఈ మార్కెట్ ని పెంచుకోవాలని తాపత్రయ పడుతున్నాడు.

నిఖిల్ ఇంతకుముందే సుకుమార్ శిష్యుడు తీసిన ’18 పేజెస్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాని అక్టోబర్, నవంబర్ లో విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, దాన్ని ఇప్పుడు రీషూట్ చెయ్యమని కోరాడట నిఖిల్. హిందీ మార్కెట్ కి నచ్చే విధంగా ఆ సినిమాలో కొన్ని సీన్లు (అంటే ఫైట్లు) పెట్టమని ఆదేశించాడట.

అలాగే, ఇంతకుముందే ‘స్పై’ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ ఒకటి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమాని కూడా చాలా వరకు రీషూట్ చెయ్యనున్నారు.

బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తన సినిమాలు మార్చాలని అంటున్నాడు. కొత్తగా ఒప్పుకునే సినిమాలన్నీ ‘భారీగా’ ఉంటాయట. ఇప్పటికే పారితోషికాన్ని పెంచాడు. ఒక్క సినిమా పెద్ద హిట్ అయ్యేసరికి నిఖిల్ తన రేంజ్ పెరిగింది అని భావిస్తున్నాడు.

ఐతే, ’18 పేజెస్’, ‘స్పై’ చిత్రాలు ఎలా ఆడుతాయి, ఏ మేరకు వసూళ్లు సాధిస్తాయి అన్న దాన్ని బట్టి అతని ఫ్యూచర్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఐతే, అతని మాట చెల్లుబాటు అవుతోంది.

 

More

Related Stories